కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలివే..?!

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంలో లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కరోనా బారిన పడి కోలుకున్న వారు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కోసం ఎదురు చూస్తున్న బాధితులను పరీక్షించడానికి ప్రభుత్వం మంగళవారం తాజా ప్రకటనలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క ఉత్సర్గ విధానానికి అనుగుణంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వారికి ఎలాంటి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. అలాగే అంతరాష్ట్ర, దేశీయ ప్రయాణాలు చేపట్టే ఆరోగ్యకరమైన వ్యక్తులకు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించబోమని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు పరీక్షలు నిర్వహించడం వల్ల అదనపు భారం పడుతోందని, అందుకే వారికీ పరీక్షలు నిర్వహించడం కుదరదన్నారు.

కరోనా
కరోనా

ఐసీఎంఆర్ తెలిపిన వివరాల ప్రకారం..
ఆర్‌ఏటీ లేదా ఆర్‌టీ-పీసీఆర్ ద్వారా ఒకసారి పరీక్షించిన వ్యక్తి పాజిటివ్ వస్తే మరోసారి ఆ పరీక్షలు నిర్వహించరాదన్నారు. ఎంఓహెచ్, ఎఫ్‌డబ్ల్యూ విధానానికి అనుగుణంగా ఆస్పత్రి డిశ్చార్జ్ సమయంలో కోవిడ్‌తో కోలుకున్న వ్యక్తికి ఎలాంటి పరీక్షలు చేయరాదన్నారు. అలాగే అంతరాష్ట్ర, దేశీయ ప్రయాణాలు చేపట్టే ఆరోగ్యకరమైన వ్యక్తులో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించరాదన్నారు.

వైరస్ బారిన పడని వ్యక్తులు తప్పనిసరిగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోని ప్రయాణాలు చేపట్టాలి. ఒక వేళ మీకు కరోనా లక్షణాలు, ఫ్లూ లాంటి లక్షణాలు ఉంటే ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు. మొబైల్ పరీక్షా ప్రయోగశాలలు ఇప్పుడు జిఎమ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటి సాయంతో దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా కరోనా బాధితులు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించుకోవచ్చు. కరోనా బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత.. ఇంకా 10-15 రోజుల పాటు కరోనా లక్షణాలు కనిపిస్తుంటాయి. మూడు రోజులపాటు జ్వరం వంటి సమస్యలు వస్తాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా కొద్ది రోజులపాటు స్వీయ నియంత్రణ పాటించాలి. ఆక్సిజన్ సరఫరా కానప్పుడు స్థానికంగా ఉన్న కోవిడ్ హెల్త్ సెంటర్‌కు బాధితుడిని తరలించాలి. లేదా 1075కు సంప్రదించి సమస్యను తెలియజేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news