సొంత వైద్యంతో ప్రమాదమే..!

-

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్న విషయం తెల్సిందే. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకున్నప్పటికీ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే కరోనా భయంతో చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. కొంత మంది లక్షణాలు కనిపించిన వెంటనే తమకు తెలిసిన మందులను వాడుతున్నారు. ఇక కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు కూడా ముందు జాగ్రత్తతో అందుబాటులో ఉన్న మందులను తీసుకుంటున్నారు.

అయితే ఇలా తమకు తెలిసిన, అందుబాటులో ఉన్న ఔషధాలను తీసుకోవడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మేలు కంటే హాని ఎక్కువ ఉందని అంటున్నారు. వైద్యులను సంప్రదించకుండా యాంటీవైరల్‌, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్‌ మందులను వాడటం వల్ల మరింత ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

కాగా కరోనా బారిన పడిన వారిలో దాదాపు 80-85 శాతం మంది సులభంగానే కోలుకుంటుండగా… కేవలం 10-15 శాతం మందికి మాత్రమే ఆస్పత్రిలో వైద్యం అందించాల్సి వస్తుంది. కరోనా పాజిటివ్ గా తేలిన వారు వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనలు పాటించి.. కరోనాను ఎదుర్కోవాలని డాక్టర్లు కోరుతున్నారు. అవసరం అనుకుంటేనే ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. సరైన ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తే కరోనా నుంచి బయట పడవచ్చని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news