24 గంటల్లో 546 మందికి కరోనా : తెలంగాణలో కలకలం..!

-

కరోనా మహమ్మారి తెలంగాణలో కోరలు చాచింది.. దీని తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలో పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 546 కేసులు నమోదు కాగా, 5 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 7072 కేసులు నమోదు కాగా, 203 మంది మృతి చెందారు. అయితే ఇవాళ ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 458 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 50 కేసులు, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3506 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 3363 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 154 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news