ఈ కరోనా సమయంలో చాలామంది వ్యాపారవేత్తలు, సామాన్యులు, రాజకీయ నాయకులు, సినీ కళాకారులు… ఇలా అన్ని రంగాలవారూ తమకు తోచిన విధంగా ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తున్నారు! ఈ క్రమంలో తమిళ మాజీ హీరో, రాజకీయ నాయకుడు విజయకాంత్ తీసుకున్న ఒక నిర్ణయం అందరి ప్రశంసలనూ పొందుతుంది. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేకంగా విజయ కాంత్ ను ప్రశంసించారు! దీంతో… మిగిలిన విరాళాలు అన్నీ ఒకెత్తు… విజయకాంత్ విరాళం ఒకెత్తు అన్నట్లుగా ప్రశంసల జల్లులు కురుస్తున్నానయట!
ఈ కరోనా పుణ్యమాని రోజు రోజుకీ పెరుగుతున్న మరణాల నేపథ్యంలో… పలుచోట్ల శ్మశానాల్లో కరోనా మృతులను ఖననం చేయనివ్వడం లేదు! కరోనా సోకి మృతిచెందిన వారి మృతదేహాలను ఖనం చేసినా ఆ వ్యాది వ్యాపించదు అని చెబుతున్నా కూడా.. చాలా మంది బుర్రకు ఎక్కడం లేదు! వారిని ఇక్కడ కాల్చినా, పూడ్చినా… మా ఏరియాకి కరోనా వస్తుంది కాబట్టి.. మా వద్ద దహనం వద్దు, ఖననం వద్దు అంటూ నిర్దయగా వ్యతిరేకిస్తున్నారు. సరిగ్గా ఈ విషయమే హీరో విజయ్ కాంత్ ను కదిలించింది.. వెంటనే స్పందించిన ఆయన, కరోనా మృతులకు తన కాలేజీ గ్రౌండును శ్మశానంగా వాడుకోమని ప్రభుత్వానికి చెప్పాడు.
ఈ సమయంలో ప్రజల సమస్యలు అర్ధం చేసుకుని విజయ్ కాంత్ చూపిన ఉదారత గొప్పది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్‌కాంత్ కు చెన్నై శివారల్లో ఆండాళ్ అళగర్ పేరుతో ఇంజినీరింగ్ కళాశాల ఉంది. దీనికి పక్కనే పెద్ద గ్రౌండ్ కూడా ఉంది. అందులో కొంత కరోనా మృతుల ఖననానికి ఇస్తానని విజయ్ కాంత్ తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో… పవన్ కళ్యాణ్ కూడా ‘‘ఈ నిర్ణయం తీసుకున్న విజయ్ కాంత్ ది గొప్ప వ్యక్తిత్వం‘‘ అని ప్రశంసించారు.