డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన.. 1.70 కోట్ల మందికి లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు

-

కరోనా వ్యాపించిన మొదటి రెండేళ్లలో ఈయూ దేశాల్లో దాదాపు 1.70 కోట్ల మంది దీర్ఘకాలిక కరోనా లక్షణాలతో బాధపడినట్లు డబ్ల్యూహెచ్‌ కోసం ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌, ఎవల్యూషన్‌ చేపట్టిన అధ్యయనంలో తేలింది. పురుషులతో పోలిస్తే మహిళలు (అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర) ఈ సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది.

2020, 2021ల్లో ఈయూ దేశాల్లో కరోనా సోకిన కొందరిలో కనీసం మూడు నెలలపాటు లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు కొనసాగాయని నివేదికలో పేర్కొంది. యూరప్‌, మధ్య ఆసియా ప్రాంతాల్లో లక్షలాది మంది దీర్ఘకాలిక కొవిడ్‌ లక్షణాలతో బాధపడినట్లు డబ్ల్యూహెచ్‌వో యూరప్ రీజినల్ డైరెక్టర్ హెన్రీ క్లూగే సైతం ధ్రువీకరించారు.

లాంగ్‌ కొవిడ్‌ లక్షణాల బారిన పడే అవకాశం పురుషుల కంటే మహిళల్లో రెండింతలు ఎక్కువగా ఉందని నివేదిక సూచిస్తోంది. ఒక్కోసారి ఆసుపత్రిలో చేరేంతగా పరిస్థితులు దిగజారే అవకాశం ఉందని పేర్కొంది. ముగ్గురు మహిళల్లో ఒకరు, ఐదుగురు పురుషుల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా వేసింది. ‘కొవిడ్‌తో ఎంత మంది ప్రభావితమయ్యారు? ఎంతకాలం ఆరోగ్య వ్యవస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? తదితర అంశాలు తెలుసుకునేందుకు ఈ పరిశోధన చేపట్టినట్లు ఐహెచ్‌ఎంఈ డైరెక్టర్ క్రిస్టోఫర్ ముర్రే తెలిపారు. అయితే, ఈ గణాంకాలు కేవలం అంచనాలేనని.. లాంగ్‌ కొవిడ్‌పై రూపొందించిన ఇతర అధ్యయనాల వివరాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news