ఫ్యాక్ట్ చెక్: ఈ 21 పాయింట్ల రూల్స్ లో వున్న నిజమెంత…? ICMR ఏం చెప్పిందంటే..?

-

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎమ్ఆర్ గురువారం నాడు సోషల్ మీడియాలో ఉన్న ఫేక్ రూల్స్ గురించి తెలియజేయడం జరిగింది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటి నుండి కూడా సోషల్ మీడియా లో అనేక రకమైన ఫేక్ న్యూస్లు కనబడుతూనే ఉన్నాయి. మరోమారు అటువంటిదే చోటు చేసుకుంది.

సోషల్ మీడియా లో కరోనా కి సంబంధించిన సర్క్యులర్ ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఐసీఎమ్ఆర్ దీని కోసం మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చేసింది. అటువంటి సర్క్యులర్ల లో ఎటువంటి నిజం లేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ ఇమేజ్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఎంత మాత్రం నిజం లేదు అని చెప్పేసింది.

ఈ ఫేక్ లిస్టు లో ఫారెన్ కి రెండేళ్ల పాటు వెళ్లొద్దని, సంవత్సరం వరకు బయటి ఆహారం తీసుకోవద్దని, దగ్గుతున్న వ్యక్తి నుండి దూరంగా రావాలని, ఏడాది పాటు జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకి వెళ్లొద్దని దానిలో ఉంది. అలానే షూస్ తో ఇంట్లోకి రావద్దని కూడా దానిలో రాసారు.

సోషల్ మీడియాలో విపరీతంగా ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఐసీఎంఆర్ ఎటువంటి గైడ్ లైన్స్ ని ఇవ్వలేదని స్పష్టం చేసేసింది. బయటకు వెళ్తున్నప్పుడు బెల్ట్, వాచ్ పెట్టుకుని వెళ్లొద్దని కూడా దీనిలో రాశారు. కరోనా కొన్ని రోజులలో తగ్గిపోతుందని ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి అని కనీసం 6 నుండి 12 నెలల వరకు కూడా కరోనాకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని రాయడం జరిగింది.

అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని ICMR స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే చాలా మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒకపక్క ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత కూడా ఉంది ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news