ఫ్యాక్ట్ చెక్ :అగ్నిపథ్ పథకం రిజిస్ట్రేషన్లు Whatsapp ద్వారా జరుగుతున్నాయా?

-

సైన్యంలో చేరడానికి కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. దాని పేరు అగ్నిపథ్. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించారు.అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అంటారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేయొచ్చు. ఆ తర్వాత వారి పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.నాలుగేళ్ల కాలంలో ఆర్మీ నిబంధనల ప్రకారం ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది.

 

పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అగ్నిపథ్‌ పథకం ద్వారా సైన్యంలో చేరవచ్చు. పదో తరగతి లేదా ఇంటర్ పాసైన యువతీ యువకులు అర్హులు. అయితే, ప్రస్తుతం అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అనంతరం అమ్మాయిలకు కూడా ఈ అవకాశం ఇస్తామని చెబుతున్నారు. అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు.. అయితే ఈ పథకం గురించి ఇటీవల పెద్ద ఎత్తున చర్చలు జరిగిన విషయం తెలిసిందే.. ఇటీవల ఒక నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అగ్నిపథ్ పథకం రిజిస్ట్రేషన్లు Whatsapp ద్వారా జరుగుతున్నాయని అందులో ఉంది.

ఇందుకు సంభందించిన మూడు రిజిస్ట్రేషన్ ఐడి లను కూడా పొందుపరిచారు. ఈ విషయం పై పిఐబి సంస్థ సర్వేను నిర్వహించింది. ప్రభుత్వం ఇలాంటివి చేయలేదని తేల్చి చెప్పింది. అది ఫేక్ న్యూస్.. డాబిబి దయచేసి నమ్మకండి అని హెచ్చరించింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news