ఫ్యాక్ట్ చెక్: చించినాడ బ్రిడ్జ్‌ కూలిపోయిందా..? నిజమెంత..?

-

ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసిన చెంచినాడ బ్రిడ్జి పై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ బ్రిడ్జి కి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే అసలు సోషల్ మీడియాలో వచ్చిన వార్త ఏమిటి…? అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.

ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసిన చెంచినాడు బ్రిడ్జి కూలిపోయింది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో నిజం ఎంత అనేది ఇప్పుడు చూసేద్దాం.

చెంచినాడు బ్రిడ్జ్ ఉండడం వల్ల తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు సులువుగా సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇది కూలిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.

పైగా ఈ వీడియో పోలీసుల దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో ఎవరైనా అనవసరంగా ఇలాంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. ఈ బ్రిడ్జి కూలిపోవడం లో ఎలాంటి నిజం లేదని ఇది కేవలం ఫేక్ వార్త అని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఈ ఫేక్ పోస్ట్ ని ఎవరు ఫార్వర్డ్ చెయ్యొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news