ఫ్యాక్ట్ చెక్: క్రెడిట్ కార్డులు వాడే వాళ్ళు ఈ తప్పులు చేస్తే ఇక అంతే..!

-

ఈరోజుల్లో క్రెడిట్ కార్డులను ఎక్కువ మంది వాడుతున్నారు.. ముందు వినియోగించుకొని తర్వాత నెలకు డబ్బులను కట్టడం కాబట్టి పెద్ద మొత్తంలో శాలరీలు వచ్చే ఉద్యోగులు రెండు, మూడు బ్యాంక్ క్రెడిట్ కార్డులను వాడుతున్నారు..ఇష్టం వచ్చినట్లు కాకుండా లిమిట్ వరకూ కార్డులను వినియోగించాలి.. ఎందుకంటే వడ్డీ, ఇతర ఛార్జీలు అంటూ భారీగా వడ్డించనున్నాయి బ్యాంకులు. అందుకే క్రెడిట్‌ కార్డులు వాడే వారు జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇక గడువులోగా బిల్లు చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోయే అవకాశం ఉంది.

మీరు భవిష్యత్తులో రుణాలు తీసుకునే సమయంలో ఆ ప్రభావం చూపే ప్రమాదం ఉంది. క్రెడిట్ స్కోర్‌ తగ్గిపోతే ఏ బ్యాంకు నుంచి కూడా రుణం అందదు. దీంతో సమయానికి బిల్లు చెల్లిస్తూ సరిగ్గా వాడుకుంటే రుణాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.ఇలాంటి కార్దులు వాడే వారు క్రెడిట్ స్కొర్ ను కూడా మెయిన్ టైన్ చేయాలి.క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో తక్కువ రేట్లతో రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

క్రెడిట్ స్కోర్‌ ను ప్రభావితం చేసే అంశాలను చూస్తే..కార్డు నుంచి తీసిన ఎమౌంట్ లేదా ఏదైనా బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను సమయంలో చెల్లించాలి.లేకుంటే స్కోర్‌ తగ్గుతూ వస్తుంది.వేరొకరి రుణానికి మీరు హామీ ఇవ్వడం, మీ రుణాన్ని పునర్నిర్మించడం వంటివి. మరో విషయం ఏంటంటే..కుటుంబ సభ్యులకు, బంధువులకు హామీదారుగా ఉండటం సర్వ సాధారణం. అయితే ఇలా తరచుగా చేయడం వలన తమ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుందనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు.ఇలా చేస్తే కొత్త రుణాల కోసం మీ సొంత అర్హత తగ్గడమే కాదు, అసలు రుణగ్రహీతకు బకాయిలు ఉన్నట్లయితే మీరు కూడా నష్టపోవచ్చు.. అందుకే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. బిల్లులు సరైన టైంలో పే చెయ్యాలి.

Read more RELATED
Recommended to you

Latest news