ఫ్యాక్ట్ చెక్: ఈ నకిలీ ఫేస్ బుక్ పేజీ తో జాగ్రత్త..!

-

నకిలీ వార్తలతో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా లో మనకి తరచు నకిలీ వార్తలు కనపడతాయి. నిజానికి ఒక్కొక్క సారి మనకి ఏది నకిలీ వార్త ఏది నిజమైన వార్త అనేది కూడా తెలియదు. ఆన్లైన్ లో ఎక్కువగా మోసాలు జరుగుతూ ఉంటాయి ఆన్లైన్ లో మోసాల వలన చాలా మంది ఖాతా జీరో అవుతోంది కూడా.

ఏదేమైనాప్పటికీ అనుమానంగా ఉండే వార్తలు కనపడితే కంప్లైంట్ చేయడం వంటివి చేయాలి అంతే కానీ తెలిసీ తెలియకుండా లింక్స్ మీద క్లిక్ చేసి ఇబ్బందుల్లో పడకండి. తాజాగా ఒక మెసేజ్ వైరల్ గా మారింది. ఇంతకీ అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.

బిఎస్ఎఫ్ ఇండియన్ ఆర్మీ అని ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది అయితే ఆ పేజ్ నిజమైనదని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారిక పేజ్ అని అంటోంది. కానీ నిజానికి ఇది నకిలీ పేజీ. ఇది నిజమైనది కాదు. ఒరిజినల్ పేజీ @OfficialPageBSF కాబట్టి అనవసరంగా నకిలీ ఫేస్బుక్ పేజీలని నమ్మి మోసపోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది కాబట్టి ఇటువంటి పేజీలతో జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరే నష్టపోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news