ఫ్యాక్ట్ చెక్: ఉద్యోగాలని ఈ వెబ్ సైట్ ఇస్తోందా..? నిజమేనా..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు కనపడుతున్నాయి. ఇటువంటి వార్తలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే మోసపోవాల్సి వస్తుంది. ఈ మధ్యన చాలా మంది నకిలీ వార్తల వలన మోసపోయారు. ఉద్యోగాలు మొదలు స్కీములు దాకా ఎన్నో నకిలీ వార్తలు మనకి సోషల్ మీడియాలో కనబడుతున్నాయి.

ఏది నిజం ఏది నకిలీది అనేది తప్పక తెలుసుకోండి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ షికార్లు కొడుతోంది. మరి అది నిజమో కాదో ఇప్పుడే తెలుసుకుందాం. ఇక పూర్తి వివరాలని చూస్తే… https://t.co/qbVytM2tET అనే ఈ వెబ్సైట్ ద్వారా ఉద్యోగాలని పొందచ్చని ఆన్లైన్ రిక్రూట్మెంట్ చేస్తుందని పైగా నిరుద్యోగుల అలోవెన్స్ ని కూడా ఇస్తోందని ఈ వార్త లో ఉంది. పైగా ఇది లేబర్ మినిస్ట్రీ కి సంబంధించినదని కూడా ఆ వార్త లో ఉంది.

ఇది నిజమా కాదా అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తో దీనికి సంబంధం లేదు. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే కనుక అనవసరంగా నమ్మి మోసపోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. https://t.co/qbVytM2tET అనే ఈ వెబ్సైట్ కి ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. కాబట్టి అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని నమ్మకండి మోసపోకండి.