ఫ్యాక్ట్ చెక్: పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన కింద ఐదు లక్షలా..? నిజమెంత…?

తాజాగా ఒక పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ రైతుల కోసం 5 లక్షల రూపాయలు పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన కింద ఇస్తున్నట్లు ఆ సోషల్ మీడియా పోస్ట్ లో ఉంది. అయితే నిజంగా పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన కింద రైతులకు ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయా…? దీనిలో నిజమెంత అనేది చూస్తే….

 

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువైపోతున్నాయి. పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేంద్రం ఈ స్కీమ్ కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు రాసి పక్కనే ప్రధానమంత్రి ఫోటో కూడా ఉంది. అయితే ఇది నిజమా కాదా అనేది చూస్తే.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన అనే దానిని తీసుకురాలేదు.

Fact Check: Rs 5 lakh subsidy news under the PM Kisan Tractor Yojana is FAKE

ఇది కేవలం వట్టి ఫేక్ న్యూస్. అసలు ఇలాంటి స్కీం ని కేంద్ర ప్రభుత్వం తీసుకు రాలేదు. ట్విట్టర్ లో ఎవరు ఒక ఫేక్ ట్వీట్ ని చేశారు. అదే విధంగా మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అఫీషియల్ వెబ్ సైట్ ని చూస్తే ఇటువంటి ప్లాన్ ఏమీ లేదని తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన అనేది ఫేక్ న్యూస్. దీనిలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఇటువంటి స్కామ్స్ ని ఎవరు నమ్మి మోసపోద్దు.