ఫ్యాక్ట్ చెక్: వారికి ఫ్రీగా ల్యాప్టాప్స్…?

-

సోషల్ మీడియాలో తరచూ మనకి నకిలీ వార్తలు కనపడుతూ ఉంటాయి. ఇలాంటివి నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసరంగా నష్టపోవాల్సి ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ షికార్లు కొడుతోంది. కొడుతుంది మరి ఆ వార్త నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడే మనం తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఉద్యోగాలు మొదలు పలు స్కీముల వరకు రకరకాల ఫేక్ వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనబడుతున్నాయి.

ఇలాంటి వార్తలు చూసి చాలా మంది మోసపోతున్నారు ఇక తాజాగా వచ్చిన వార్త నిజమా కాదా అసలు ఆ విషయం ఏంటి అనేది చూద్దాం… సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఫ్రీగా లాప్టాప్ లని విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని.. పైగా ఈ స్కీం కింద లాప్టాప్ లని ఉచితంగా పొందచ్చని కింద పర్సనల్ వివరాలను ఇచ్చేసి లాప్టాప్ లని ఫ్రీగా పొందచ్చని సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తలో ఉంది.

ఇది నిజమా కాదా అనేది చూస్తే ఇది వట్టి నకిలీ వార్త అని తెలిసిపోతోంది. ఇందులో ఏమాత్రం నిజం లేదు సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త వట్టి నకిలీదే. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్టాప్లను ఇవ్వడం లేదు అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని నమ్మి మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news