ఫ్యాక్ట్ చెక్: విదేశీయులు రద్దు చేసిన నోట్లని మార్చుకోవడానికి గడువుని పెంచారా..?

-

ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు విపరీతంగా పెరిగిపోయాయి. నకిలీ వార్తలకి దూరంగా ఉంటేనే మంచిది. లేకపోతే మీరే నష్ట పోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా లో తరచూ మనకి నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి నకిలీ వార్తలని ఆశలు పట్టించుకోకండి చాలా మంది నకిలీ వార్తలని చూసి నమ్ముతారు.

అలానే ఇతరులకి కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఆ తప్పును చేయొద్దు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ షికార్లు కొడుతోంది మరి ఆ వార్తలో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం… కేంద్ర ప్రభుత్వం నోట్లని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన వార్త లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసిన నోట్లని విదేశీయులు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని ఆ తేదీని వాళ్ళ కోసం ఎక్స్టెండ్ చేసిందని ఆ వార్తలో ఉంది.

మరి నిజంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిందా..? దీనిలో నిజం ఎంత అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఫారిన్ సిటిజెన్స్ కి 2017 తో ఈ అవకాశం పూర్తయిపోయింది. కనుక ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. పీఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి ఇది వట్టి నకిలీ వార్త అని చెప్పేసింది. కాబట్టి అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని నమ్మి మోసపోకండి పైగా ఇతరులకి కూడా చాలామంది షేర్ చేస్తున్నారు ఆ తప్పును చేయొద్దు. నకిలీ వార్తలని గుర్తించి వాటికి దూరంగా ఉండడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news