ఫ్యాక్ట్ చెక్: 18-40 ఏళ్ల వాళ్లకి ప్రభుత్వం రూ.1800 ని ఇస్తోందా..?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. ఇక ఇది ఇలా ఉంటే ఒక పెద్ద ఆయన క్రికెట్ ఆడుతున్నారు.

అయితే తాజాగా నెట్టింట్లో మరొక వార్త తెగ షికార్లు కొడుతోంది. ఇక దాని కోసం చూస్తే… 1800 రూపాయలని నెల నెలా ప్రభుత్వం 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల వయసు వాళ్ళకి ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన కింద ఇస్తున్నట్లు అందులో ఉంది. అయితే మరి ఈ ప్రభుత్వ స్కీమ్ ద్వారా 1800 రూపాయలు 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల వాళ్ళకి నిజంగా ఇస్తోందా లేదా అనేది చూస్తే…

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన కింద ఈ డబ్బులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో నిజం లేదు. ఇది కేవలం వట్టి ఫేక్ వార్త మాత్రమే. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పదించింది. ఇది నకిలీ వార్త అని తేల్చేసింది. కనుక అనవసరంగా ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి మోసపోవద్దు.

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ ని తీసుకు రాలేదు. ఈ నకిలీ వార్తని నమ్మదు మరియు ఇతరులకి ఫార్వర్డ్ చెయ్యొద్దు. అయితే కేవలం 60 ఏళ్లు దాటిన వాళ్లకి మాత్రమే పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతే కానీ ఈ వయసు వాళ్ళకి ఎలాంటి పెన్షన్ కూడా కేంద్రం ఇవ్వడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news