ఫ్యాక్ట్ చెక్: మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈ లెటర్ ని ఇచ్చిందా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

తాజాగా ఒక వార్త వచ్చింది అది సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. క్లర్క్ పోస్ట్ కి సంబంధించి జాయినింగ్ లెటర్ మినిస్టరీ ఆఫ్ రైల్వేస్ ఇచ్చిందని అందులో ఉంది. పైగా మూడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎగ్జామ్ ఫైల్ ఫీజు కింద చెల్లించాలంటూ అందులో ఉంది.

 

అయితే మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. క్లర్క్ పోస్ట్ కి సంబంధించి మినిస్టరీ ఆఫ్ రైల్వేస్ అంటూ వచ్చిన లెటర్ ఫేక్ ఇందులో ఏ మాత్రమూ నిజంలేదు అనవసరంగా 3880 రూపాయలను చెల్లించద్దు. ఇటువంటి ఫేక్ వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి ఇలాంటి వాటికి జాగ్రత్త పడకపోతే మోస పోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news