ఫ్యాక్ట్ చెక్: సున్నా వడ్డీకి రూ. 25 లక్షలు లోన్ మహిళలకి ఇస్తున్నారా..?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం.

ఇక ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 25 లక్షల రూపాయల లోన్ ని మహిళలకు ఇస్తోందని… సున్నా వడ్డీ కి ఈ లోన్ ని పొందొచ్చని అందులో ఉంది. ప్రధానమంత్రి నారీ శక్తి యోజన కింద ఈ డబ్బుని అందిస్తున్నట్లు అందులో రాసి ఉంది.

అయితే మరి నిజంగా ప్రభుత్వం 0% వడ్డీకి మహిళలకు రుణాలు ఇస్తోంది..? ఇందులో నిజమెంత అనేది చూస్తే… కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకురాలేనట్లు తెలుస్తోంది. మహిళలకే రూ. 25 లక్షల రూపాయలు లోన్ ని ఇవ్వడం లేదు. ఇందులో ఏ మాత్రం నిజం లేదు.

ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. ఈ వార్త పై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించి. ఇది నకిలీ వార్త అని తేల్చేసింది. 2 లక్షల 20 వేల రూపాయలు ఈ ప్రధానమంత్రి నారీ శక్తి యోజన కింద మహిళలకు ఇవ్వడం లేదని తేల్చేసింది కనుక అనవసరంగా ఇలాంటి నకిలీ వార్తలను నమ్మి మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news