ఫ్యాక్ట్ చెక్: ఉద్యోగాలంటూ మోసం.. ఈ ఫేక్ వెబ్ సైట్ తో జాగ్రత్త..!

-

ఈమధ్య కాలం లో వస్తున్న నకిలీ వార్తల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రోజు రోజుకీ నకిలీ వార్తలు మనకి ఎక్కువ అయిపోతున్నాయి. పైగా ఫోన్ ఓపెన్ చేస్తే చాలు నకిలీ వార్తలు కనబడుతూనే ఉంటాయి. ఏది ఏమైనా ఇటువంటి నకిలీ వార్తలని చూసి అనవసరంగా మోసపోకూడదు. ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ షికార్లు కొడుతోంది. మరి ఆ వార్త నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం. చాలా మంది ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉద్యోగం దొరకక దొరికిన సైట్ల లో అప్లై చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. చాలా మంది నిరుద్యోగులు ఫేక్ సైట్ల కారణంగా మోసపోతున్నారు. డబ్బులు కూడా కట్టేస్తున్నారు ఆ తప్పుని మీరు అసలు చేయకండి.

తాజాగా ఒక వెబ్సైట్ నిరుద్యోగులకు ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రచారం చేస్తోంది. ఈ వెబ్సైట్ పలు రకాల పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్లు చెబుతోంది. కానీ ఈ వెబ్సైట్ వట్టి నకిలీ వెబ్సైట్ మాత్రమే. ఇది నిజం కాదు. అనవసరంగా ఈ వెబ్సైట్లోకి వెళ్లారంటే మీరే మోసపోవాల్సి వస్తుంది.

ఈ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ది అంటూ ప్రచారం చేస్తుంది. కానీ ఇది నిజం కాదు. https://nttm.ind.in అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి సంబంధించినది కాదు. కాబట్టి అనవసరంగా ఇతరులకి ఇటువంటి వార్తలు షేర్ చేయొద్దు అలానే మీరు కూడా మోసపోవద్దు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఇది నకిలీ వార్త అని చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news