ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ ఒక ప్లకార్డు మీద “I stand with ISRAEL” అని రాసివున్న దానిని పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోకి సంబంధించి నెటిజన్లు కూడా చర్చిస్తున్నారు.
మార్క్ జ్యుకర్ బర్గ్ ఇలా ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫోటోలు చూసి కొందరు ఫేస్బుక్ ని అన్ ఇంస్టాల్ చేయాలి అంటూ చెప్పడం కూడా జరిగింది. అయితే దీనిలో ఎంత నిజం అనే విషయాన్ని చూస్తే… ఈ ఫోటోలు ఏ మాత్రం నిజం లేదని.
మార్క్ జూకర్ బర్గ్ థాంక్స్ అని పట్టుకున్న ఫోటోని ఇలా మార్కింగ్ చేసినట్లు తెలుస్తోంది. గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా చేస్తే అసలు ఫోటో కనబడుతోంది. అయితే కేవలం ఈ ఫోటో లో ఎటువంటి నిజం లేదని కేవలం మార్ఫింగ్ మాత్రమే అని గమనించాలి.
థాంక్స్ అని ఉన్న ప్లకార్డు పట్టుకున్న ఫోటోని జూలై 2010లో మన జుకర్బర్గ్ తీసుకున్నారు. ఫేస్బుక్ కి 500 మిలియన్లు నెంబర్లు అవడము తో సంతోషం తో ఈ ఫోటోని మార్క్ జూకర్బర్గ్ పోస్ట్ చేయడం జరిగింది. ఆ ఫోటోని ఇలా మార్ఫింగ్ చేసారు.