ఫ్యాక్ట్ చెక్: రాష్ట్రపతి భవన్‌లో నాన్ వెజ్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిషేదించారా..?

సోషల్ మీడియాలో నిత్యం ఏదొక వార్త చక్కర్లు కొడుతుంది..అయితే కొన్ని వాస్తవానికి దగ్గరగా ఉంటే, మరికొన్ని మాత్రం నిజ నిర్దారన లేకుండా ఉన్నాయి.. ఇలాంటివి జనాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి..ఇలాంటి వార్తలు రోజుకోకటి పుట్టుకొస్తున్నాయి..తాజాగా మరో వార్త చక్కర్లు కోడుతుంది.రాష్ట్ర పతి భవన్ లో నాన్ వెజ్ అనేది అనుమతి లేదని,కొత్తగా వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విషయాన్ని సీరియస్ గా చెప్పారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

రాష్ట్రపతి భవన్, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ప్రదేశం. ఇప్పుడు భారతదేశం యొక్క 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని రోజుల నుంచి అక్కడ ఉంటున్న సంగతి తెలిసిందే..గిరిజన సంతతికి చెందిన మొదటి రాష్ట్రపతి కావడం తో, ఆమె సాంస్కృతిక నేపధ్యం, నిరాడంబరమైన జీవనశైలి చూసి రాష్ట్రపతి భవన్‌లో ఆమె చేయబోయే మార్పుల పై అందరికీ ఆసక్తిని కలిగించింది, ఇది అనేక పుకార్లకు దారితీసింది.

రాష్ట్రపతి భవన్‌లోని మెనూ పూర్తిగా శాఖాహారంగా మారిందని, అతిథులకు కూడా నాన్‌వెజ్‌ ఫుడ్‌ను నిషేధించారంటూ అటువంటిదే ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా షేర్‌ అవుతోంది. రాష్ట్రపతి భవన్‌లో ఎలాంటి మాంసాహార విందులు లేదా పానీయాలపై నిషేధం” అని పోస్ట్ పేర్కొంది..భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి భవన్‌లో మాంసాహారం నిషేధించబడుతుందన్న వాదన అవాస్తవం.

వెతికినప్పుడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు లేకుండా శాఖాహార భజనం మాత్రమే తీసుకుంటారనే కథనాలు దొరికాయి, కానీ ఇకపై విందుల్లో కూడా మాంసాహారం అందించకూడదని రాష్ట్రపతి కొత్త ఉత్తరువులు ఇచ్చినట్టు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇటీవలి కాలంలో ఈ దిశగా ఎలాంటి పత్రికా ప్రకటన పిఐబి లో కూడా వెలువడలేదు..రాష్ట్రపతి భవన్ లో వచ్చిన స్వదేశీ, విదేశీ అతిథుల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని సిద్ధం చేస్తారు. అక్కడ ఏదైనా ప్రత్యేకమైన ఆహారాన్ని తినమని బలవంతం ఉండదు..పిఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా ఈ వాదన అవాస్తవం అని, రాష్ట్రపతి భవన్‌లో నాన్ వెజ్ లేదా డ్రింక్స్‌పై అలాంటి నిషేధం లేదని ట్విట్టర్‌లో స్పష్టం చేసింది.