ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న మనాలి ఫోటో ఇప్పటిది కాదా..?

తాజాగా ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువ మంది జనం హాలిడే కి వెళ్లినట్లు పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా వైరస్ ని కనీసం పట్టించుకోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా హాలిడే లో మునిగి పోయారు అన్న వార్త వైరల్ అయిపోయింది.వీటిలో ఒక ఫోటో నెట్టింట్లో షికార్లు కొట్టింది. మనాలి మార్కెట్ ప్లేస్ లో ఎక్కువ మంది గుమికూడి ఉండడం ఈ ఫోటో లో మనం చూడచ్చు. అయితే ఈ ఫోటోలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

కరోనా వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువైపోయాయి. ఇప్పుడూ నట్టింట్లో షికార్లు కొడుతున్న ఈ ఫోటోలో కూడా ఏ మాత్రం నిజం లేదని తేలింది. అయితే ఈ ఫోటో డిసెంబర్ 2020 లోదని తెలుస్తోంది.

డిసెంబర్ 31 2020 నాటి ఫోటో అని ఫేస్ బుక్ ద్వారా తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా డిసెంబర్ లో కొద్దిగా కోవిడ్ ఉన్నప్పటికీ చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్లడం జరిగింది. ముఖానికి మాస్క్ ధరించకుండా టూరిస్టు ఉన్నట్లు తెలుస్తోంది. కాని ఈ ఫోటో ఇప్పటిది కాదని స్పష్టంగా తేలింది.