దీపికా అనే నటి కూడా మారుతున్నారు
వాటికి అనుగుణంగా కాదు తనకు అనుగుణంగా
కాలానికి అనుగుణంగా కూడా!
ఇష్టమయిన ప్రియుడు ఇష్టమయిన ప్రదేశం
ఇష్టం అనుకునే అమ్మ బాధ్యత గా ఉండే నాన్న
ఇవి చాలు కదా! ఆమెకు అవే తన బలాలు అని అంటారామె !
బెంగళూరు సోయగం అందాల దీపికా పదుకోనే బాలీవుడ్ కు చెప్పుకోదగ్గ నటి. చెప్పుకోదగ్గ అంటే విమర్శించదగ్గ నటి అని కూడా అర్థం తీసుకోవాలి. విమర్శకు మరియు ప్రశంసకు మధ్య సంధి కాలం ఒకటి ఉంటుందని అంటారు కదా! ఆ కూడలిలో కూడా ఈ చిన్నది ఉండి హాయిగా నాలుగు మాటలు విని వెళ్తుంది. వెళ్తుంది కాదు వెళ్తారు. నవ్వి వెళ్తుంది. వెళ్తుంది కాదు వెళ్తారు.
ప్రస్తుతం రణ్ వీర్ ప్రేమలో ఉన్నారు ఈమె. ప్రేమ పూర్వక సమయాన్ని వెచ్చించడంలో ఆనందిస్తున్నాను నేను అని అంటున్నారు కూడా ! ప్రేమ ఎక్కడయినా ప్రేమే కదా అని మాత్రం చెప్పకండి. ఆ విధంగా చెప్పడంతోనే కొన్ని తప్పు అర్థాలు అచ్చు తప్పులు ధ్వనిస్తాయి..ధ్వని ముద్రణకు నోచుకుంటాయి. ధ్వని ముద్రణ (ఆడియో రికార్డింగ్) కు నోచుకున్నవన్నీ మంచివే కావొచ్చు లేదా చెడు సంబంధితాలూ కావొచ్చు. కనుక ఈ స్టార్ హీరోయన్ ను అర్థం చేసుకోవడంలో అపార్థాలకు తావివ్వకూడదు.
కొంతకాలం కిందట తానొక విపరీతం అయిన ప్రవర్తనలో ఉండిపోయారు. అక్కడి నుంచి తేరుకుని మళ్లీ కొత్త జీవితం అందుకున్నారు. సైక్రియాటిక్ డిజార్డర్ ను ఫేస్ చేసి, డిప్రసివ్ మోడ్ లో ఉండిపోయారు.అటు పై ఆమె ఎన్నో అవస్థలు దాటుకుని పేరున్న హీరోయిన్ గా స్థిరపడేందుకు ప్రయత్నించారు. తరువాత సఫలీకృతం అయ్యారు కూడా ! తన జీవితంలో బ్యాడ్ ఫేజ్ ఇదేనని అంటారామె! ఇప్పుడు మంచి ఆహారం, వ్యాయామం వంటివి పాటిస్తూ ఒంటికి ఒత్తిడి దరి చేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పారామె! తెలుగులో అవకాశం వస్తే ఎన్టీఆర్ తోనూ, అల్లు అర్జున్ తోనూ నటించాలని ఉంది అని కూడా చెప్పారామె ! ఇఫ్ ఆల్ గోస్ వెల్ ఇట్ విల్ బి హ్యాపెన్…