ఏప్రిల్ ఫస్ట్ వచ్చేసింది. సరదాగా.. ఈ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందామా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనం పుట్టిన నెలను బట్టి మన వ్యక్తిత్వం, లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మిగతావారితో పోలిస్తే.. ఈ నెలలో పుట్టినవారి చాలా భిన్నంగా ఉంటారట.
ఏప్రిల్ నెలలో పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారట. వారు దేనికి భయపడరు. ఈ వ్యక్తులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా విజయం సాధిస్తారు. ఈ విజయం సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. చాలా కష్టమైన పనులను కూడా ఎంతో ఆనందంగా చేస్తారు. ఈ మాసంలో పుట్టిన వారికి ప్రత్యేక గుణం ఉంటుంది. ఇతరులని సులువుగా ఆకర్షిస్తారు.
ఏప్రిల్ లో పుట్టిన వారు.. వారి చర్యలతో అందరినీ ఆకట్టుకుంటారు. వీరి మనస్తత్వం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. వారు తమ భావాలను మాత్రమే కాకుండా ఇతరుల భావాలను కూడా పట్టించుకుంటారు. ప్రతి ఒక్కరి భావోద్వేగాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇది మాత్రమే కాదు ఈ వ్యక్తులు తమ అనుభవాల ద్వారా ఇతరులకు జ్ఞానాన్ని అందిస్తారు. ఇలాంటి వారు భావోద్వేగానికి లోనవుతారు కానీ మోసం చేసే వారిని ఇష్టపడరని పండితులు అంటున్నారు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఈ వ్యక్తులు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు. దానికి వ్యతిరేకంగా తమ స్వరాన్ని పెంచుతారు.
ఈ నెలలో పుట్టిన వ్యక్తులు సమయపాలన బాగా పాటిస్తారు. వీరికి ఉత్సాహంతో పాటు ఉద్రేకం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా పని మొదలుపెడితే.. దానిని సకాలంలో పూర్తి చేయాలని భావిస్తారు. కాస్త ఆలస్యం అయిన అస్సలు సహించరు.
ఈ నెలలో పుట్టిన వ్యక్తులతో స్నేహం చేయాలనుకుంటే.. మీరు నిరంభ్యంతరంగా చేయొచ్చు. ఎప్పుడూ ఒంటరిగా ఉండటాన్ని అస్సలు ఇష్టపడరు. స్నేహం కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఈ నెలలో జన్మించిన వ్యక్తులు చాలా విషయాల్లో నిజాయితీగా ఉండటాన్ని ఇష్టపడతారు. వీరు తమ ప్రియమైన వారి పట్ల ప్రేమను ఇతర మార్గాల్లో వ్యక్తపరుస్తారు. వీరు తమకిష్టమైన వారిపై అపారమైన ప్రేమ, గౌరవం కలిగి ఉంటారు.
ఈ నెలలో పుట్టిన వారికి సాహసం, థ్రిల్ తో పాటు క్రీడలంటే కూడా చాలా మక్కువ ఉంటుంది. వీరు క్రీడల్లో చాలా చురుకుగా పాల్గొంటారు. వీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, క్రీడలకు మాత్రం కచ్చితంగా సమయం కేటాయిస్తారు.
– Triveni Buskarowthu