
కొత్త సంవత్సరం అంటే మాటలా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త సంవత్సరం సందర్భంగా.. డిసెంబర్ 31న 70 కోట్ల రూపాయల మద్యాన్ని హాంఫట్ అనిపించారట. వామ్మో… అది కూడా గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ లోనే. సంవత్సరం క్రితం అంటే డిసెంబర్ 31, 2017 న అమ్మకాలు 60 కోట్ల రూపాయలు మాత్రమే. ఈసారి 10 కోట్ల అమ్మకాలు పెరిగాయి. ఈసారి గత సంవత్సరం కంటే ఎక్కువ చలి ఉన్నా… చలిని లెక్క చేయకుండా… నగర వాసులు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. మందు తాగుతూ… న్యూ ఇయర్ కు మందుబాబులు ఘనంగా స్వాగతం పలికారు. మందుబాబులం మేము మందుబాబులం అంటూ చిందేశారు.