గాల్లోంచి వచ్చిన వస్తువు తగిలి బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మాయం..

-

రోడ్డుపై డ్రైవింగ్‌ అంటే.. ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. మనం ఎంత బాగా డ్రైవ్‌ చేసినా..ఎదురువచ్చావాళ్లు,  పక్కనవెళ్లే వాళ్ల వల్ల కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి.. కొన్ని ప్రమాదాలు అయితే మనం ఊహించలేం.. సడన్‌గా ఏదైనా జరగొచ్చు.. లారీ పక్కన వెళ్తుంటే.. ఆ లారీకి ఉన్న తాడు.. పక్కన  వెళ్తున్న బైకిస్ట్‌ మెడకు చుట్టుకుంది. అలాంటి ఓ ఘటనే ఇది కూడా..!

బైక్‌పై వేగంగా వెళ్తున్న ఒక వ్యక్తిని గాలిలోంచి ఏదో తెలియని వస్తువు ఎగిరొచ్చి తగిలింది. ఆ వస్తువు బారి నుంచి తప్పించుకునే టైమ్‌ కూడా బైక్‌ పై ఉన్న వ్యక్తికి లేదు. అతడు ఉన్న వేగం ధాటికి ఆ వస్తువు తగలడంతోనే అతడు బైక్ పై నుంచి వెనక్కి ఎగ్గిరిపడ్డాడు. బైక్ మాత్రం అదే వేగంతో కొంతదూరం వరకు నేరుగా దూసుకుంటూ వెళ్లి రోడ్డుకి కుడివైపున ఉన్న ఫుట్ పాత్‌ని ఢీకొని ఫుట్ పాత్ పైకి ఎగిరిపడింది.

అయితే ఈ ఘటనలో బైక్ రైడర్ బైక్‌పై నుంచి పడిపోయిన విధానం చూస్తే.. అతడు బైక్‌పై నుంచి దాదాపు అదృశ్యమయినట్టుగానే అనిపిస్తుంది. ఈ వీడియో చూసి మరో డౌట్‌ రావొచ్చు.. అసలు ఇది వీడియో ఎలా తీశారు అని.. ఆ బైక్ వెనకే వస్తున్న మరో వాహనంలో ఉన్న డాష్‌బోర్డ్ కెమెరాలో ఈ దృశ్యం రికార్డైనట్టుగా కనిపిస్తోంది. అందువల్లే ఈ రోడ్డు యాక్సిడెంట్ తర్వాత బైక్ రైడర్‌కి ఏమైంది అనేది ఈ వీడియోలో ఎక్కడా రికార్డ్ అవలేదు. కానీ ప్రమాదం జరిగిన తీరు, అతడి ఒక్క ఉదుటున గాల్లోకి లేచి వెనక్కి ఎగిరిపడిన తీరు చూస్తే.. ప్రమాదం తీవ్రత కూడా ఎక్కువే ఉంటుందని అనిపిస్తోంది. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి.. అసలు అర్థమేకాదు.. గాల్లోంచి వచ్చిన ఆ వస్తువేంటో.. ఆ బైకిస్ట్‌ ఎటువెళ్లిపోయాడో పాపం..! ఈ వీడియో సోషల్‌ మీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే 73.8k వ్యూస్‌ వచ్చాయి.. ఇంకా కామెంట్స్‌ అయితే బోలెడు..

Read more RELATED
Recommended to you

Latest news