సాదారణంగా ఏదైనా బరువైన వస్తువును నీళ్ల లోకి వేస్తే అది ఖచ్చితంగా మునిగిపోతుంది..నీటికి వక్రీభవనం కూడా ఎక్కువే..అందుకే ఏ వస్తువువైన వస్తువు మునిగిపోతుంది..కానీ ఓ నగరం సముద్రం మీద తెలియాడుతూ కనిపిస్తుంది..ఆ నగరంలో పంటలను పండిస్తున్నారు.వావ్..ఇది వినడానికి వింతగా ఉన్న కూడా ఇది నూటికి నూరు శాతం నిజం..అదేలా సాధ్యం అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా సాగరతీరాల్లో ఉన్న నగరాలు తక్కువేమీ కాదు గాని, సాగరంలోని అలలపై తేలియాడే నగరం ఎక్కడైనా ఉందంటే అది వింతే..ఆ విధమైన నగరం అనేది దక్షిణ కొరియాలో ఉంది.. మరి ఆలస్యం ఎందుకు దాని గురించి ఒకసారి వివరంగా చుద్దాము..తొలి తేలియాడే నగరాన్ని బ్యూసన్ సాగరతీరానికి ఆవల సముద్రం అలలపై నిర్మించింది. ‘ఓషియానిక్స్’ పేరిట పూర్తి జనావాసానికి అనుకూలమైన నగరాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి సహకారంతో నిర్మించింది.
త్వరలోనే ఇది పర్యాటకుల రాకపోకలకు, నౌకల రవాణాలకు అనువుగా సిద్ధం కానుంది. సముద్రంలో తేలియాడే ఈ నగరంలో రకరకాల ఆహార పంటలను పండిస్తుండటం, పండ్ల తోటలను పెంచుతుండటం కూడా విశేషం..వినడానికి చాలా థ్రిల్ గా ఉంది కదా.. చూస్తె ఎంత బాగుంటుందో.. ఎప్పుడైనా జాలి ట్రిప్ వేస్తే మాత్రం అక్కడ అందాలను చూడండి..