ప్రాణాలకు తెగించింది.. కోబ్రాను చంపేసింది.. వీడియో

-

Amazing dog Vs snake video goes viral

కుక్క… విశ్వాసానికి మారు పేరు. తన యజమాని ఉప్పు తింటున్నందుకు.. ఆ యజమానికి కుక్కలా కాపలా కాయాలి కదా. అందుకే.. అక్కడికి వచ్చిన కోబ్రాతో తన ప్రాణాలను తెగించి మరీ పోరాడింది. చివరకు ఆ నాగుపామును చంపేసింది. కుక్క, నాగుపాము పోరాటానికి గమనించిన ఆ ఇంటి యజమాని వాటి పోరాటాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. ఆ వీడియో తీసిన వ్యక్తిని మాత్రం నెటిజన్లు విమర్శిస్తున్నారు. నాగుపామును అతి కిరాతకంగా కుక్క చంపేస్తుంటే వీడియో తీస్తూ కూర్చున్నావా? సిగ్గు లేదా నీకు.. పాము ఏ పాపం చేసింది.. దాన్ని బంధించి తీసుకెళ్లి అడవిలో వదిలేయొచ్చు కదా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరికొందరు మాత్రం ప్రాణాలకు తెగించి మరీ పాముతో పోరాడిన కుక్కను మెచ్చుకుంటున్నారు.

Wilderness – Animal Wildlife – Real fight! Wow Amazing dog Vs snake- Brave dogs fight to save owner from the snake-Dogs kill cobra

Wilderness – Animal Wildlife – Real fight! Wow Amazing dog Vs snake- Brave dogs fight to save owner from the snake-Dogs kill cobra

Posted by Animal Attack on Saturday, December 29, 2018

Read more RELATED
Recommended to you

Latest news