గణపతితో పాటు డాన్సింగ్ అంకుల్ విగ్రహం..

డాన్సింగ్ అంకుల్ గుర్తున్నాడా? గోవింద స్టయిల్ డాన్స్ వేసి అదరగొట్టాడు కదా. గుర్తొచ్చాడా? ఓవర్ నైట్ స్టార్ అయిన డాన్సింగ్ అంకుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వయసులోనూ ఆయన వేసే డాన్సుకు అంతా ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో డాన్సింగ్ అంకుల్ సంజీవ్ శ్రీవాస్తవ్ కు మాంచి ఫాలోయింగ్ ఉంది. మధ్యప్రదేశ్ లోని విదిశ డాన్సింగ్ అంకుల్ సొంతూరు. గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఆయన అభిమానులు విదిశలో గణేశ్ విగ్రహంతో పాటు సంజీవ్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. దీంతో డాన్సింగ్ అంకుల్ విగ్రహాన్ని చూడటానికి అక్కడి స్థానికులు పోటీ పడుతున్నారు.