ఓమైగాడ్.. ఎస్కలేటర్ అదుపు తప్పింది.. తర్వాత ఏం జరిగిందో చూడండి..!

-

అది ఇటలీలోని రోమ్ లో ఉన్న మెట్రో స్టేషన్ లోని ఎస్కలేటర్. ప్రయాణికులంతా మెట్రో రైలు దిగి ఎస్కలేటర్ ఎక్కారు. ప్రయాణికులంతా ఒక్కసారిగా ఎస్కలేటర్ ఎక్కడంతో అది అదుపుతప్పింది. వేగంగా వెళ్లింది. దీంతో దానిమీద ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఒకరిమీద మరొకరు పడ్డారు. దీంతో చాలామందికి గాయాలయ్యాయి. వీళ్లంతా అక్కడ జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 20 మందికి గాయాలయినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news