అప్పుడప్పుడు సేఫ్టీ డెమోలు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంటారు కదా. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం వచ్చినా వాటిని తట్టుకునేలా డెమోలు ఇస్తుంటారు. బ్యాంకాక్‌లో కూడా ఇలాగే కొండచిలువ బారి నుంచి ఎలా తప్పించుకోవాలో డెమో ఇస్తునాడు ఫైర్‌మాన్. అయితే.. అనుకోకుండా ఆ కొండచిలువ నిజంగానే మనోడిని పట్టేసింది. ఎంత లాగినా అది అతడిని వదల్లేదు. అతడిని గట్టిగా పట్టుకోవడంతో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత మళ్లీ అది అతడిని వదిలేయడంతో మనోడు ఊపిరి పీల్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(Video courtesy: HindustanTimes)