ఓ ఐఏఎస్ ఆఫీసర్.. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన భార్యపై సోషల్ మీడియాలో ఆ యువకుడు అసభ్యకరమైన కామెంట్లు చేశాడని చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు.. వీడియోలో వినిపిస్తున్న వాయిస్ ప్రకారం.. ఆ యువకుడిని చంపేస్తానంటూ ఆ ఐఏఎస్ బెదిరించాడు. ఆ వీడియో వైరల్ అవడంతో.. ఉన్నతాధికారులు అతడిని సెలవులపై ఇంటికి పంపించారు.
ఆ ఐఏఎస్ పేరు నిఖిల్ నిర్మల్… పశ్చిమ బెంగాల్ లోని అలిపుర్దువార్ జిల్లా మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన నిన్న జరగగా… దానిపై నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం… వినోద్ కుమార్ సర్కార్ అనే యువకుడు.. ఐఏఎస్ ఆఫీసర్ భార్య నందిని కిషన్ సోషల్ మీడియా అకౌంట్ లో అసభ్యకరమైన కామెంట్లు పెట్టాడు. దీంతో ఫలకట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన ఐఏఎస్ ఆఫీసర్.. ఆ యువకుడిని అరెస్ట్ చేయగానే… అక్కడికి వెళ్లి రెచ్చిపోయాడు. పోలీసుల ముందే.. పోలీస్ స్టేషన్ లోనే ఆ యువకుడిపై దాడి చేశాడు. తప్పయిపోయింది.. క్షమించాలంటూ ఆ యువకుడు వేడుకున్నా వాళ్లు కనికరించలేదు. లాఠీ తీసుకురండి.. లాఠీతో కొడుతా అంటూ ఐఏఎస్ భార్య పోలీసులను అడగడం.. వాళ్లు లాఠీ మీరు ఉపయోగించకూడదు మేడం అంటూ వాళ్లు చెప్పడం అన్నీ వీడియోలో రికార్డయ్యాయి.
See how Bengal IAS officer, Nikhil Nirmal, district magistrate of Alipurduar district take law in his own hands. He & his wife beat up a youth for making lewd comments on his wife’s Facebook profile. Incident unfolds inside the police station & infront IC of Police @dna @ZeeNews pic.twitter.com/iRCO7SnRa6
— Pooja Mehta (@pooja_zeenews) January 6, 2019