ఏంది.. కెమిస్ట్రీ పెళ్లి పత్రికా? ఇంకా నయం.. ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, హిస్టరీ పెళ్లి పత్రికలు కూడా ఉంటాయని చెప్పలేదు అంటారా? నిజమండి బాబు.. ఓ జంట వినూత్నంగా తమ పెళ్లికి కెమిస్ట్రీ పెళ్లి పత్రికను అచ్చు వేయించింది. ఇదిగో.. మీరు పైన చూస్తున్నారు కదా ఫోటో. అది వాళ్ల పెళ్లి పత్రికలో ఓ భాగం. కెమిస్ట్రీ తెలిసిన వాళ్లకయితే ఈజీగా అర్థం అవుతుంది. కేరళకు చెందిన సూర్య వితున్ నాయర్ అనే యువతి ప్లాన్‌కు ప్రతిరూపమే ఈ వినూత్న పెళ్లి పత్రిక.
ఆమె కెమిస్ట్రీ టీచర్. అందుకే.. తన పెళ్లి పత్రికను కూడా కొత్తగా.. తనకు తెలిసిన కెమిస్ట్రీని ఉపయోగించి అచ్చేయించి ఆ కార్డును తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. అనుకోకుండా ఆ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడం, దాన్ని కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ చూడడం.. దాన్ని షేర్ చేసి కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పడం ఓవర్‌నైట్‌లో జరిగిపోయాయి. దీంతో ఆ జంట పెళ్లి కాస్త నెటిజన్లు ముచ్చటించుకునేలా అయింది.