వీడియో..ఆవుదూడకి బారసాల.. అందమైన పాటతో ఘనంగా ఉత్సవం

-

మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన రోజులని పండగలా జరుపుకుంటారు. పుట్టినరోజు, బారసాల, అన్నప్రాసన, పుట్టు వెంట్రుకలు, పుట్టు పంచలు, పుట్టు ఒళ్ళెలు, పెళ్ళి, షష్టిపూర్తి, ఆ తర్వాత అందరికీ తెలిసిందే. ఐతే ఇలాంటి రోజులన్నీ కేవలం మనుషులు మాత్రమే జరుపుకుంటారు. ఏ జంతువుకి కూడా తన పుట్టినరోజు తెలియదు. బారసాల చేయరు. ఇక మిగతా వాటి సంగతి సరే సరి. కానీ మనుషులమైన మనం జంతువులకి కూడా ఇలాంటి పండగలు జరుపుతున్నాం.

ఎడ్ల పొలాల అమావాస్య రోజు ఎద్దులని బాగా అలంకరించి వాటిని ప్రత్యేకంగా రెడీ చేస్తారు. జంతువుల గురించి ఇలాంటి స్పెషల్ పండగలు ఉన్నప్పటికీ బారసాల వంటివి చేయడం ఉండదు. తాజాగా కొందరు మహిళలు ఆవుదూడకి బారసాల నిర్వహించి వావ్ అనిపించారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఆవుదూడని ఉయ్యాల్లో కూర్చోబెట్టి దాని చుట్టూ ఆడవాళ్ళందరూ చేరి ఉయ్యాలని అటూ ఇటూ ఊపుతూ మంచి పాటని పాడుతూ బారసాలని నిర్వహించారు.

ఉయ్యాలకి అలంకరణ చేసి, చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉయ్యాల్లో ఉన్న ఆవుదూడని చూసే వరకు అందులో ఉన్నది నిజంగా అదేనా లేక, చంటిపిల్లాడా అన్న అనుమానం కలగక మానదు. అంతలా అందరూ చుట్టూ చేరి పాటలు పాడుతున్నారు. దండాలోయమ్మా గోమాత, మా అండా దండా నీవేనమ్మా గోమాత. కుడితి తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు. ఇంధనాల పొందు లేకుండా కాడెద్దులనే మాకిచ్చినావు. ఎండకెండినావు, వానకి నానినావు ఎకరకెకరాల మన్ను దున్నినావు అంటూ సాగిన పాట ఆసక్తికరంగా ఉంది. ఒక్కసారి మీరూ చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news