ఓహో.. లింబో డ్యాన్స్ చేసి అదరగొట్టింది..!

-

అదరగొట్టుడంటే ఇదే మరి.. మనకు ఉన్న టాలెంట్‌ను నలుగురికి చూపిస్తేనే మన సత్తా ఏంటో తెలిసేది. ఎందుకంటే న్యూయార్క్‌కు చెందిన షెమీకా చార్లెస్ అనే యువతి లింబో డ్యాన్స్ చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. చార్లెస్ మాంచి లింబో డ్యాన్సరట. ఓరోజు తన భర్తతో కలిసి ఫిలడెల్ఫియా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిందట. తను వెళ్లాల్సిన విమానం ఆరోజు కొంచెం లేట్‌గా వస్తుందని అనౌన్స్ చేశారట. దీంతో ఏం చేయాలో తెలియక.. తనకు ఉన్న లింబో డ్యాన్స్ టాలెంట్‌ను అక్కడ ఉన్నవారికి చేసి చూపించింది. ఆ వీడియోను తన భర్త వీడియో తీసి యూట్యూబ్‌లో షేర్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లింబో డ్యాన్స్‌లో పేరొందిన చార్లెస్.. ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్నదట.

Read more RELATED
Recommended to you

Latest news