బాబోయ్ మాకు ఈ చదువులు వద్దు… చిన్నారి వీడియో వైరల్…!

ఉదయాన్నే లేచి పిల్లలు స్కూల్ కి వెళ్లడం అనేది నిజంగా వారికి చాలా కష్టంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పది మందిలో ఒకరు ఇద్దరు మినహా పెద్దగా పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి ఆసక్తి చూపించరు. వాళ్ళను తల్లి తండ్రులు, భయపెట్టి, బ్రతిమిలాడి బామాలి పంపిస్తూ ఉంటారు. పాపం ఎందరో విద్యార్థులకు చదువు ఒక నరకం కూడా… దీనిపై ఒక చిన్నారి తాజాగా ఒక వీడియోలో మండిపడింది. తమ స్కూల్ కష్టాల గురించి చక్కగా వివరిస్తూ తమకు ఒక నెల పాటు సెలవు కావాలని, ఈ బాధలు తాము పడలేకపోతున్నామని వ్యాఖ్యానించింది.

పోలీసు అధికారి అరుణ్ బోత్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చిన్నారి మాటలు చూస్తే… పిల్లలైన మేము పాఠశాలకు వెళ్లడాన్ని అసహ్యించుకున్నాం. ఉపాధ్యాయుల నుండి హోంవర్క్ వరకు దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని ఆ పాప వివరించింది. గుజరాతులో మాట్లాడుతున్న ఆ పాప… తన స్కూల్ నుంచి తనకు ఒక నెల పాటు విముక్తి కావాలని కోరుతుంది. ప్రతీ ఒక్కరు ఉదయాన్నే లేవడం పళ్ళు తోముకోవడం, పాలు తాగడం మరియు పాఠశాలకు వెళ్లడం గురించి ఆమె అమాయకంగా చెప్పడం చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

ఇక తన స్కూల్ షెడ్యూల్ గురించి వివరిస్తూ… మొదట ప్రార్థన, తరువాత ఇంగ్లీష్, తరువాత ఈవీఎస్, తరువాత గణితం అని చెప్తూ వాటిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అందంగా అమాయకంగా ఉన్న ఆ పాప వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు మూడు మిలియన్ల మంది ఈ వీడియోని వీక్షించారు. తమను ఈ చదువుల నుంచి బయటపడేయాలని కోరుతూ భారత విద్యావ్యవస్థను పలు ప్రశ్నలు కూడా వేస్తుంది. దీనిపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మానిష్ సిసోడియా కూడా స్పందించారు. ఓహ్ మై గాడ్ అంటూ ఆయన ఆ వీడియో రీట్వీట్ చేశారు.