వ్యక్తి జేబులో నుంచి పర్స్ కొట్టేస్తూ కెమెరా కంటికి చిక్కి అడ్డంగా బుక్కయ్యాడు…!!

భలే ఫన్నీగా ఉంటుంది ఈ వీడియో. ఇటువంటి ఘటనలను మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. ఇది మాత్రం నిజంగా ముంబై మహానగరంలో జరిగింది. సాధారణంగా రోజు దొంగతనాలు ఎన్నో జరుగుతుంటాయి. కొంతమంది దొంగలు దొరుకుతారు.. మరికొంతమంది దొరకరు. ఇదంతా పాత పాట. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎక్కడికెళ్లినా కెమెరా కన్ను కాపుకాస్తూ ఉంటుంది. సేమ్ ఇలాగే ఓ దొంగ ముంబైలో దొంగతనం చేస్తూ కెమెరా కంటికి అడ్డంగా బుక్కయ్యాడు.

ఓ వ్యక్తి జేబులోనుంచి పర్స్ కొట్టేశాడు ఓ దొంగ. వెంటనే అక్కడ ఉన్న సీసీటీవీని గమనించి అందులో రికార్డవుతుందని గ్రహించి.. సీసీటీవీ కెమెరావైపు చూసి దండం పెట్టి ఆ పర్సును ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చేశాడు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ముంబై పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. డేగకన్ను మిమ్మల్ని ప్రతి చోట గమనిస్తూనే ఉంటుంది.. జాగ్రత్తగా ఉండండి అంటూ క్యాప్సన్ పెట్టి మరీ వీడియోను ట్వీట్ చేశారు. ఇక.. ఆ వీడియో పోస్ట్ అయిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ ఫన్నీ దొంగతనం చేసిన వ్యక్తిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మనోడిపై తెగ జోక్స్ వేసుకుంటున్నారు.