తెలంగాణ ప్రభుత్వం లెటర్ హెడ్ మీద పార్టీ పదవి ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి

-

కీసర మండలం టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పేర్కొంటూ ప్రభుత్వ లెటర్ హెడ్ మీద అపాయింట్ మెంట్ జారీ చేశారు. నెటిజన్లకు మల్లారెడ్డి అడ్డంగా దొరికిపోవడంతో నెటిజన్లు ఆయనపై విమర్శల ఆస్త్రం గుప్పిస్తున్నారు.

ఎంపీ నుంచి ఎమ్మెల్యే ఆ తర్వాత మంత్రిగా చోటు దక్కించుకున్న మల్లారెడ్డి నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆయన మీద ఒకటే కామెంట్లు. ఆయనకు సంబంధించిన ఓ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

minister mallareddy uses telangana govt letter head for trs party appointment

ఆయన టీఆర్‌ఎస్ పార్టీ తరుపున ఓ వ్యక్తికి పదవిని కేటాయించారు. అందులో తప్పేమీ లేదు కానీ.. ఆయన ఆ వ్యక్తికి పదవిని ఇస్తున్నట్టుగా.. దానికి సంబంధించిన లెటర్‌ను తెలంగాణ ప్రభుత్వ లెటర్ హెడ్ మీద రాయించారు. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఆయన ఇప్పుడు మంత్రి కదా. తెలంగాణ ప్రభుత్వం లెటర్ హెడ్ మీద ఆయన శాఖకు సంబంధించిన లేదా ఇతర ప్రభుత్వానికి సంబంధించిన వాటికోసం మాత్రమే ఉపయోగించాలి.

కానీ.. కీసర మండలం టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పేర్కొంటూ ప్రభుత్వ లెటర్ హెడ్ మీద అపాయింట్ మెంట్ జారీ చేశారు. నెటిజన్లకు మల్లారెడ్డి అడ్డంగా దొరికిపోవడంతో నెటిజన్లు ఆయనపై విమర్శల ఆస్త్రం గుప్పిస్తున్నారు. ఇంత చిన్న విషయాన్ని మీరు ఎలా మరిచిపోయారు.. పార్టీ లెటర్ హెడ్, ప్రభుత్వ లెటర్ హెడ్‌కు తేడా తెలియదా మంత్రి గారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్ ఇదే.

Read more RELATED
Recommended to you

Latest news