లోకేశ్ బాబు మళ్లీ అడ్డంగా బుక్కయ్యారు.. దేశంలో 900 లోక్ సభ స్థానాలు ఉన్నాయట..!

-

దేశంలో ఎన్ని లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయో తెలియని నువ్వు మంత్రివి అంటూ కామెంట్లు చేస్తున్నారు. 545 స్థానాలతో పాటు శ్రీలంక, పాకిస్థాన్ స్థానాలు కూడా కలిపి చెబుతున్నావా చినబాబు అంటూ వ్యంగాస్ర్తాలు సంధిస్తున్నారు నెటిజన్లు.

ఏంటి.. సోషల్ మీడియా కాస్త ప్రశాంతంగా ఉంది అనుకున్నాం. కానీ.. నారా లోకేశ్ బాబు ఉండనిస్తే కదా. అవును.. లోకేశ్ బాబు మళ్లీ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. మీరు ఊరుకోండి.. ఊరికే చినబాబును ఆడిపోసుకుంటారు. పప్పులో కాలేయడం ఆయనకేమన్నా కొత్తా? అని అంటారా. అలా అంటే చేసేదేమీ లేదు.

lokesh babu again booked on social media by saying 900 lok sabha seats in india

లోకేశ్ బాబు దేశంలో 900 లోక్ సభ స్థానాలు ఉన్నాయని చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. ఆ విషయాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్యాచ్ చేశారు. వెంటనే ట్విట్టర్‌లో ఓ ట్వీటు ట్వీటారు.

పప్పు మళ్లీ ఇరుక్కున్నాడు. దేశంలో 900 లోక్ సభ స్థానాలున్నాయంట. మంగళగిరిలో 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని కోరినట్లే ఉంది. తండ్రేమో రష్యన్ హ్యాకర్లు ఈవీఎంల ఫలితాలను మారుస్తారని గోల చేస్తున్నారు. ఇద్దరూ రాష్ట్రం పరువు మంట గలుపుతున్నారు. పప్పు, తప్పులను గొలుసులతో కట్టేయలేమా?.. అంటూ ఆయన ట్వీట్ చేశారు.

లోకేశ్ బాబు.. దేశంలో 900 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. అని చెప్పే వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? దేశంలో ఎన్ని లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయో తెలియని నువ్వు మంత్రివి అంటూ కామెంట్లు చేస్తున్నారు. 545 స్థానాలతో పాటు శ్రీలంక, పాకిస్థాన్ స్థానాలు కూడా కలిపి చెబుతున్నావా చినబాబు అంటూ వ్యంగాస్ర్తాలు సంధిస్తున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news