శృంగారంలో పాల్గొంటే సహజంగానే కొందరు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తుంటారు. అయితే ఆ శబ్దాలు బయటకు వినబడకుండా ఉంటే ఓకే. వినబడితేనే సమస్యలు వస్తాయి. చుట్టు పక్కల వారికి ఆ శబ్దాలు వినిపిస్తే అస్సలు బాగోదు. సరిగ్గా అక్కడ కూడా అలాగే జరిగింది. ఓ వ్యక్తి ఇంట్లో రాత్రి పూట శృంగారంలో పాల్గొంటే శబ్దాలు బాగా వస్తున్నాయని చెబుతూ పక్కనే ఉండే ఇంకో వ్యక్తి అతనికి లేఖ రాశాడు. దీంతో ఆ లెటర్ వైరల్‌గా మారింది.
స్టీఫెన్ కన్నింగమ్ అనే వ్యక్తి ఉదయాన్నే లేచి చూడగా తలుపు కింద నుంచి ఓ లెటర్ కనిపించింది. దాన్ని తీసి అతను చదివాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న ఎవరో వ్యక్తి ఆ లెటర్ రాసినట్లు గుర్తించాడు. స్టీఫెన్ రాత్రి పూట శృంగారంలో పాల్గొన్నప్పుడు అతని ఇంటి నుంచి శబ్దాలు బయటకు వస్తున్నాయని, ఇంటి గోడలు చాలా పలుచగా ఉంటాయని, శబ్దాలు బయటకు వస్తాయని, కనుక ఇకపై శృంగారంలో పాల్గొంటే సైలెంట్ గా కార్యక్రమం చేసుకోండి.. అంటూ లెటర్‌లో ఉంది.
దీంతో స్టీఫెన్ మొదట ఖంగు తిన్నాడు. అయినా తమాయించుకుని ఆ లెటర్‌ను ఎవరు రాశారో చూశాడు. కానీ పేరు లేదు. తన ఇంటి పక్కన ఉండే ఎవరో రాసి ఉంటారని అతను అర్థం చేసుకున్నాడు. దీంతో ఒకింత ఆందోళనగా ఫీలయ్యాడు. అయితే అదే లెటర్‌ను అతను ట్విట్టర్‌లో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది. దానికి 800కు పైగా లైక్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ లెటర్‌ను చదివిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో మీ చుట్టు పక్కల ఉన్నవారికి ఇయర్ ప్లగ్స్ కొనివ్వు.. అని రిప్లై ఇస్తే, కొందరు మాత్రం.. నువ్వు అక్కడ ఉండకుండా రాత్రికి రాత్రే వేరే దగ్గరికి వెళ్లిపో.. అంటూ సలహా ఇచ్చారు.