ఓ పైలెట్ కు విమానం నడుపుతుంటే ఫుల్లుగా నిద్రొచ్చింది. ఏం చేయాలి. విమానం వేగంగా దూసుకెళ్తుంది. మరోవైపు మనోడికి కురుపట్లు వస్తున్నాయి. ఇలా కాదనుకున్నాడు. విమానం ఎక్కడన్నా పోనీ అనుకొని కాక్ పీట్ లోనే హాయిగా నిద్రపోయాడు. దాని ఫలితంగా ఏం జరిగిందో తెలుసా?
ఆస్ట్రేలియాకు చెందిన పైపర్ పీఏ 31 ఆ విమానం పేరు. అది ప్రయాణికుల విమానం కాదు.. గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ విమానం. ఆ విమానంలో పైలట్ ఒక్కడే ఉన్నాడు. కోపైలట్ కూడా లేడు. టాస్మానియాలోని దేవన్ పోర్ట్ నుంచి కింగ్ ఐలాండ్ కు ఆ విమానం బయలుదేరింది. విమానం టేకాఫ్ అయ్యాక.. కొంత దూరం ప్రయాణించాక.. పైలట్
నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ఆ విమానం డెస్టినేషన్ ఎయిర్ పోర్ట్ లో కాకుండా… 46 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ అయింది. ఇది నిజంగా అసమర్థత చర్య అని… దీనిపై విచారణ చేపట్టామని.. నిద్రలో ఉన్న పైలట్.. సరిగ్గా విమానం ల్యాండ్ అయ్యే సమయానికి ఎలా లేచాడో అర్థం కావట్లేదని ఆస్ట్రేలియన్ ట్రాన్స్ పోర్ట్ సేఫ్టీ బ్యురో ప్రకటించింది.