భార్యాభర్తల బంధం చాలా గొప్పది. అది జీవితాంతం పండాలంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య సఖ్యత ఎల్లకాలం ఉండాలి. ఏ ఒక్కరు మరొకరిని గౌరవించకున్నా.. కించపరిచినా ఆ కాపురంలో గొడవలే. భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. గొడవలు పెట్టుకోని భార్యాభర్తలు ఉండరు అని పెద్దలు చెబుతుంటారు. ఆ గొడవలే మళ్లీ వాళ్లను దగ్గర చేస్తాయి అని అంటారు.
అయితే.. ఇలాగే ఓ జంట కూడా ఎప్పుడూ గొడవలు పడుతుందట. న్యూఢిల్లీకి చెందిన ఆ జంట పెళ్లి నవంబర్ 2016 లో జరిగినా.. ఒక్క రోజు కూడా వాళ్లు సంతోషంగా ఉన్నది లేదు. ఎప్పుడో నెలకో.. రెండు నెలలకు ఓసారి మాత్రం సంతోషంగా గడుపుతారు. మళ్లీ అదే తంతు.. తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు. వాళ్లే 22 ఏళ్ల కరణ్, 22 ఏళ్ల కాజల్.
కాజల్ ప్రస్తుతం గర్భవతి. కాజల్ గర్భం దాల్చినా వాళ్లిద్దరి మధ్య గొడవలు మాత్రం తగ్గలేదు.. ఇంకా పెరిగి పెద్దయ్యాయి. ఓరోజు ఇలాగే గొడవ పెట్టుకొని మళ్లీ దగ్గరయింది ఆ జంట. ఇంతలో కాజల్.. తన భర్తకు ముద్దివ్వబోయింది. లిప్ కిస్ ఇవ్వబోయి అతడి నాలుకను గట్టిగా తన పళ్లతో కొరికేసింది. కాజల్ చేస్తున్న వింత చర్యకు భయపడి పోయిన కరణ్ ఏం జరిగిందా అని చూస్తే తన నాలుక సగం తెగిపోయింది.
వెంటనే బాధితుడు ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి మామూలుగానే ఉన్నా అతడు ఏం మాట్లాడలేకపోతున్నాడు. భవిష్యత్తులోనూ అతడు మాట్లాడటం కష్టమేనని డాక్టర్లు చెబుతున్నారు. చూశారుగా.. భర్తను ముద్దు పెట్టుకోకుండా నాలుకను ఎలా కొరికేసిందో. తన భర్తపై ఉన్న కోపాన్ని అలా తీర్చుకున్నదన్నమాట.