రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తుంది. ఆమె ఖాతాలో మంచి హిట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం చేతిలో ఓ మూడునాలుగు సినిమాలు కూడా ఉన్నట్టున్నాయి. మరీ అంత బొద్దుగా కూడా ఏమీ ఉండదు రకుల్. కానీ.. ఫిట్ నెస్ కోసం చాలా కష్టపడుతుంది.
అప్పుడప్పుడు తను మంచి ఫిజిక్ ను మెయినెటెన్ చేయడానికి ఎలా కష్టపడుతుందో.. ఆ వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టింది రకుల్. ఏకంగా 40 కిలోల బరువున్న ఓ డంబెల్ ను నడుముకు కట్టుకొని స్క్వాట్స్ చేసింది. రెండు మూడు సార్లు కూర్చొని లేచేసరికి ఆమె వల్ల కాలేదు. కానీ.. పక్కనే ఓ వ్యక్తి కమాన్.. కమాన్.. అంటూ ఎంకరేజ్ చేస్తుంటే ఆమె స్క్వాట్స్ చేసింది.
అయితే… ఆమె ఇంత కష్టపడుతూ స్క్వాట్స్ చేయడానికి ఓ కారణం ఉందట. తన మెడ బాగా నొప్పి పెడుతుందట. అందుకే.. ఇలా చేస్తే తగ్గుతుందని చేసిందట. ఆమె మెడనొప్పి తగ్గిందో లేదో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం ఆమె వీడియో చూసి నోరెళ్లబెడుతున్నారు. ఏంది రకుల్.. ఇట్లా చేస్తున్నవు. ఎలాగూ నువ్వు సన్నగనే ఉంటావు కదా. ఇంకా ఈ వర్కవుట్లు దేనికి. ఇంట్లో రెస్ట్ తీసుకోక.. దేనికి నీకు ఈ బాధ .. ఇలా రకరకాల కామెంట్లు పెడుతున్నారు.