ఎన్.టి.ఆర్ బయోపిక్ వద్దని కోడి రామకృష్ణ చెప్పారు..!

-

శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ శుక్రవారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 120పైగా సినిమాలు చేసిన కోడి రామకృష్ణ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ తో సినిమాలు చేశాడు. ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాలని అనుకున్నా అది కుదరలేదు. ఎన్.టి.ఆర్ అంటే అమితమైన అభిమానం ఉన్న కోడి రామకృష్ణ ఆయనతో సినిమా చేయకున్నా భారత్ బంద్ సినిమాకు అతిథిగా వెళ్లి సినిమా తీసినట్టు అనుభూతి పొందారట.

అయితే ఇదే సందర్భంలో ఎన్.టి.ఆర్ బయోపిక్ పై తన కామెంట్ వినిపించారు కోడి రామకృష్ణ. సాధారణంగా బయోపిక్ సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ చూపించిన కోడి రామకృష్ణ. ఎన్.టి.ఆర్ బయోపిక్ చేయడం ఎందుకని అన్నారట. మహనీయుల వ్యక్తిత్వం గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది. అందుకే ఎన్.టి.ఆర్ బయోపిక్ ఛాన్స్ ఒకవేళ తనకు వచ్చినా చేసే వాడిని కాదని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్ప్పారు. అయితే బాలకృష్ణ చేసిన ఎన్.టి.ఆర్ బయోపిక్ పై కూడా తండ్రికి తగ్గ తనయుడిగా బాలకృష్ణ చేయడం సమంజసమే అన్నట్టు మాట్లాడారు కోడి రామకృష్ణ.

రామకృష్ణ గారు ముందు చెప్పినట్టుగానే బయోపిక్ రెండు పార్టులు డిజాస్టర్ అయ్యాయి. ఎన్.టి.ఆర్ అంత గొప్ప వ్యక్తి గురించి బయోపిక్ తీసి విమర్శలకు తావిచ్చేలా చేశారు. కోడి రామకృష్ణ మాట విని ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా తీయడకుండా ఉంటే బాగుండేది. సినిమాగా తీసి ఆయన్ను అవమానపరచినట్టు అయ్యిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news