పాకిస్థాన్‌ను తిట్టండి.. చికెన్ లెగ్ పీస్‌పై రూ.10 డిస్కౌంట్ పొందండి..!

-

పుల్వామా దాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌ను భారత్ అంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్‌ను అస్సలు సహించేది లేదని.. పుల్వామా దాడికి ప్రతిదాడి చేయాల్సిందేనని.. ప్రతి భారత పౌరుడు కోరుకుంటున్నాడు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు పాకిస్థాన్‌పై తమ నిరసనను వ్యక్తపరుస్తున్నారు.

Say Pakistan Murdabad and get 10 rupees discount on chicken leg piece

అయితే.. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌కు చెందిన ఓ ఫుడ్ స్టాల్ ఓనర్ మాత్రం వినూత్నంగా పాకిస్థాన్‌పై తన నిరసనను వ్యక్తం చేస్తున్నాడు. తన ఫుడ్ స్టాల్‌కు వచ్చే కస్టమర్లు.. పాకిస్థాన్‌ను తిడితే.. చికెన్ లెగ్ పీస్‌పై 10 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తన ఫుడ్ స్టాల్ ముందు బోర్డు ఏర్పాటు చేశాడు. పాకిస్థాన్ ముర్దాబాద్.. అనండి.. 10 రూపాయలు డిస్కౌంట్ పొందాలంటూ చెబుతున్నాడు.

Say Pakistan Murdabad and get 10 rupees discount on chicken leg piece

మానవత్వం అనేది పాకిస్థాన్ వాళ్లకు తెలియదు. వాళ్లు భవిష్యత్తులోనూ మానవత్వం ఉంటుందని నేను అనుకోను. అందుకే ప్రతి ఒక్కరు తమ మనసులో నుంచి పాకిస్థాన్ ముర్దాబాద్ అని చెప్పాలి.. అందుకే ఈ ఆఫర్ పెట్టా అంటూ చెప్పుకొచ్చాడు ఫుడ్ స్టాల్ ఓనర్.

Read more RELATED
Recommended to you

Latest news