బెడ్ రూంలో దూరిన పాము ఏం చేసిందో తెలుసా?

-

ఓ పాము ఏకంగా ఇంట్లోని బెడ్ రూంలోకి దూరింది. ఇంట్లోని జంట బెడ్ రూంలో పడుకుందామని వెళ్లేసరికి.. బెడ్ రూంలో హిస్ హిస్ అనే సౌండ్స్ వినిపించాయి వాళ్లకు. ఇలా ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. కొన్ని రోజుల పాటు ఇలాగే వాళ్లకు సౌండ్స్ వినిపించేవి. కాని ఒకరోజు బెడ్ రూం అంతా వెతకసాగారు. అప్పుడు వాళ్లకు ఏసీలో నుంచి ఒక తోక కనిపించింది. బహుషా.. ఎలుక దూరిందేమో అనుకున్నారు. కానీ.. ఆ తొక చిన్నగా లేదు.. పెద్దగా ఉంది.. చూస్తుంటే పాములా అనిపించింది. ఆ బుసబుసలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకున్న ఆ జంటకు వణుకుపుట్టింది.

వెంటనే స్నేక్ క్యాచర్స్ కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వ్యక్తి ఏసీలో దూరిన ఆ స్నేక్ ను బయటికి లాగి దాన్ని బంధించి తీసుకెళ్లాడు. తర్వాత దాన్ని అడవిలో వదిలిపెట్టాడట. అది మామూలు పాము కాదు. టైగర్ స్నేక్ దాని పేరు. మోస్ట్ డేంజరస్ పాము అది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో చోటు చేసుకున్నది. అప్పటి నుంచి ఆ జంట బెడ్ రూంలో హ్యాపీగా పడుకుంటున్నదట. పామును ఏసీలో నుంచి తీస్తుండగా వీడియో తీసి ఆ స్నేక్ క్యాచర్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వామ్మో.. ఏసీల్లోనూ పాములు దూరుతాయా? అంటూ నెటిజన్లు తెగ భయపడిపోతున్నారు. తెలియకుండా ఏసీలో చేతులు పెడితే అంతే కదా.. ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ పాము ఏసీలోకి ఎలా దూరిందంటారు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news