చెవిలో సాలీడు.. గూడు కట్టేసుకొని అక్కడే సెటిల్ అయింది.. వైరల్ వీడియో

-

లీ అనే 20 ఏళ్ల యువకుడికి గత కొన్ని రోజుల నుంచి చెవిలో బాగా దురద వేస్తోందట. దీంతో యంగ్జూ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ లో ఈఎన్టీ స్పెషలిస్ట్ ను సంప్రదించాడు. అతడి చెవిలో మైక్రోస్కోప్ పెట్టి చూసి షాక్ అయ్యాడు ఆ డాక్టర్. అతడి చెవి లోపల గూడు కట్టుకొని హాయిగా నిద్రపోతున్న సాలీడును చూశాడు.

సాధారణంగా సాలీడులు ఎక్కడున్నా సరే గూడు అల్లేసుకుంటాయి. వాటి వెబ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఎక్కడ గూడు ఉంటే అక్కడ స్పైడర్ ఉన్నట్టే లెక్క. అదంతా ఓకే కానీ.. ఓ సాలీడుకు గూడు కట్టుకోవడానికి ఏ ప్లేస్ దొరకలేదేమో.. ఏకంగా ఓ మనిషి చెవిలోకి దూరి.. గూడు కట్టుకుంది. ఆశ్చర్యపోయారా? నిజమే.. చెవిలో గూడు కట్టుకున్న ఆ సాలీడు.. ఆ వ్యక్తి చెవిలోనే సెటిల్ అయిపోయింది.

ఈ ఘటన చైనాలో చోటు చేసుకున్నది. లీ అనే 20 ఏళ్ల యువకుడికి గత కొన్ని రోజుల నుంచి చెవిలో బాగా దురద వేస్తోందట. దీంతో యంగ్జూ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ లో ఈఎన్టీ స్పెషలిస్ట్ ను సంప్రదించాడు. అతడి చెవిలో మైక్రోస్కోప్ పెట్టి చూసి షాక్ అయ్యాడు ఆ డాక్టర్. అతడి చెవి లోపల గూడు కట్టుకొని హాయిగా నిద్రపోతున్న సాలీడును చూశాడు. దీని వల్లే ఇన్ని సమస్యలన్ని అర్థం చేసుకున్నాడు. వెంటనే అతడి చెవిలోకి లిక్విడ్ ను పంపించి.. ఆ సాలీడును బతికుండగానే బయటికి లాగేశాడు ఆ డాక్టర్. చెవిలో సాలీడు గూడుకట్టుకొని ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news