వినాయకుడి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా గణేశ్ భక్తులంతా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక.. గణేశ్ ను కొంతమంది తమకు నచ్చిన విధంగా తయారు చేసుకొని వార్తల్లో నిలుస్తున్నారు. బిగ్ బాస్ గణపతి, బాహుబలి గణపతి.. ఇలా రకరకాల గణపతి భక్తులకు దర్శనమిస్తుండగా చెన్నైలోని టీనగర్ లో ఏర్పాటు చేసిన గణేశ్ నోరూరిస్తున్నాడు.
గణేశ్ ఏంటి నోరూరించడమేంటని ఆశ్చర్యపోకండి. ఆ వినాయకుడిని మట్టితోనే.. లేక వేరే దాంతోనే చేయలేదు. మొత్తం స్వీట్లతో చేశారు. అవును.. 300 కిలోల ఆహార పదార్థాలతో ఆ వినాయకుడిని చేశారు. అరిసెలు, జలేబీలు, పోలెలు, గర్జెలు, బాద్షా, జంతికలు, కారంపూస.. ఇలా రకరకాల స్నాక్స్ ఐటమ్స్ తో గణేశ్ ను తయారు చేశారు. దీంతో గణేశ్ ను దర్శించుకోవడానికి అక్కడికి వచ్చే వాళ్లు వినాయకుడిని చూసి నోరూరిస్తున్నారట.
గత 28 ఏళ్లుగా మేము ఇలా పర్యావరణానికి హానీ చేయని వినాయకుడిని తయారుచేస్తున్నాం. రకరకాల ఆహార పదార్థాలతో తయారు చేసి.. దాన్ని నిమజ్జనం చేసిన తర్వాత అవి సముద్రంలోని జీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది తప్ప.. పర్యావరణానికి ఎటువంటి హానీ చేయదు. దయచేసి అందరు పర్యావరణహిత వినాయకుడిని తయారుచేయండి. పర్యావరణాన్ని కాపాడండి.. అంటూ చెప్పుకొచ్చారు గణేశ్ మండలి నిర్వాహకులు.