నాకు చచ్చిపోవాలనుంది.. మీ అభిప్రాయం చెప్పండి.. ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజ్ గర్ల్ పోల్

ఇన్‌స్టాగ్రామ్ పోల్‌ను చూసి ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను ఆత్మహత్య చేసుకోవాలంటూ ప్రోత్సహించిన నెటిజన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందట.

నేటి జనరేషనే వేరు. ఏదైనా తొందరగా అయిపోవాలి. చకచకా అయిపోవాలి. చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. బాగా ఆవేశపడతారు. సంయమనం తక్కువ. అందుకే.. చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతుంటారు. ఆ ఒత్తిడిలో ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. చివరకు తమ ప్రాణాలను తీసుకోవడానికి కూడా వెనుకాడరు. వాళ్లను తమ ప్రాణాలు అంత విలువైనవని అనిపించదు.

teenage girl commits suicide after instagram poll

ఇప్పుడు మనం మాట్లాడుకునే టీనేజ్ గర్ల్ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఏం జరిగిందో తెలియదు. తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందో తెలియదు కానీ.. తను ఆత్మహత్య చేసుకోబోయే ముందు మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోల్‌ను పోస్ట్ చేసింది. నాకు చనిపోవాలని ఉంది.. చనిపోవాలా? వద్దా? చెప్పండి.. అంటూ పోల్ పోస్ట్ చేసిందన్నమాట. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? కొందరు మాత్రం వద్దు చనిపోకు.. చనిపోయి ఏం సాధించలేవు. ఏదైనా ఉంటే బతికి సాధించు అని కాస్త ఆమెకు దైర్యం నూరిపోశారు. కానీ.. కొందరు ఆకతాయిలు మాత్రం చచ్చిపో అని ఉచిత సలహా పడేశారట. అయితే.. ఎక్కువ శాతం మంది తనను చచ్చిపో.. నీవల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగం లేదని అన్నారట. దీంతో ఆ టీనేజ్ గర్ల్.. ఎక్కువ మంది చెప్పిన అభిప్రాయాన్నే ఫాలో అయింది. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మలేషియాలోని సారావాక ప్రాంతంలో చోటు చేసుకున్నది. సూసైడ్ చేసుకున్న టీనేజర్ వయసు 16 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు.

అయితే.. ఈ ఘటన మలేషియాలో సంచలనమే సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్ పోల్‌ను చూసి ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను ఆత్మహత్య చేసుకోవాలంటూ ప్రోత్సహించిన నెటిజన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందట. మలేషియా చట్టాల ప్రకారం.. మైనర్లను ఆత్మహత్యకు ప్రేరేపిస్తే.. వారికి మరణ శిక్ష లేదా 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారట. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోల్‌కు స్పందించి.. ఆత్మహత్య చేసుకోవాలంటూ తనను ప్రేరేపించిన వారందరి లిస్టును పోలీసులు సేకరిస్తున్నారు.