రెండేళ్ల పాపను కాటేసిన పాము.. కొరికిపారేసిన పాప..!

పామును చూస్తే ఎంత పెద్ద వారైనా భయపడటం ఖాయం. ముందు టెన్షన్‌ పడతారు.. పెద్దోళ్లు అయితే తర్వాత ఎదో ఒక కర్ర తీసుకుని కొట్టి చంపేస్తారు. ఒకవేళ చిన్నపిల్లలకు కనిపిస్తే ఇంకేమైనా ఉందా..! అయితే.. ఆడుకుంటున్న రెండేళ్ల వయసున్న పాపకు పాము కనిపించింది.. ఆ పాము పాపను కాటేయడంతో.. పాపకు చిర్రెత్తుకొచ్చింది..పామును చంపేసింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

పాప పేరు సే. అసలు పేరేంటో తెలియదు కానీ, అందరూ ముద్దుగా సే అని పిలుచుకుంటారు. టర్కీలోని ఓ గ్రామంలో తల్లిదండ్రలతో కలిసి నివసిస్తోంది. ఇంటి వెనుక పెరడులో ఆడుకుంటుండగా… ఈ లోపు ఏడుపు వినిపించాయి. పక్కింటి వారు వెంటనే తమ ఇంటి పెరడు నుంచి చూసే సరికి రెండేళ్లే సే పామును కొరికేసి ఏడుస్తోంది. వెంటనే తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాప నోట్లోంచి పామును తీసేశారు. ఆమె పెదవులపై పాము కాటేసిన గుర్తులు ఉన్నాయి.

అంతే..ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తే ప్రాణాపాయం తప్పింది. పాప ఆడుకుంటున్న చోటకి ఓ పాము వచ్చింది. పాప దాన్ని బొమ్మ అనుకుని చేత్తో పట్టుకుంది. అది కాస్త పెదాలపై కాటేయగానే చిట్టి పాపకు చాలా కోపం వచ్చేసింది. వెంటనే దాన్ని కొరికి చంపేసింది. కానీ అది విషపు పాము. వెంటనే చికిత్స అందడంతో పాప ప్రాణం దక్కింది.

అయితే ఈ ఘటనపై పాప తల్లి మాట్లాడుతూ…తనను కాటేసిన వెంటనే పాప పామును చంపేసింది. సే చాలా చురుకుగా ఉంటుందని, ఎవరైనా తనను తిట్టినా, కొట్టినా ఊరుకోదని చెబుతోంది. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైతే మాత్రం పాప ప్రాణాలకు ప్రమాదం అయ్యేదని తెలిపింది..మొత్తానికి ఆ పాప పామును చంపేసింది. చిట్టితల్లి అదృష్టం బాగుంది కాబట్టి.. పెద్ద గండం నుంచి బయటపడింది….ఆ సమయానికి ఎవరూ లేకుంటే..పరిస్థితి వేరేలా ఉండేది.!