దొంగతనం కూడా ఒక కళ. అంత వీజీ కాదు దొంగతనం చేయడం. అందుకే కాబోలు.. మేం విజయవంతంగా దొంగతనం చేశామని చెప్పడం కోసమేమో.. ఓ దొంగ ఏకంగా సీసీటీవీ కెమెరా ముందే పిచ్చిగెంతులు వేశాడు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఈ విచిత్ర దొంగతనం చోటు చేసుకున్నది. ఐదుగురు దొంగలు ఉన్న ముఠా గాంధీనగర్ లో ఉన్న రెండు ఇళ్లలో దొంగతనం చేసింది. దొంగతనం అనంతరం బయటికి వెళ్తూ ఇలా సీసీటీవీ కెమెరాకు చిక్కారు. మిగిలిన నలుగురు దొంగలు వెళ్లిపోతుండగా.. ఓ దొంగ మాత్రం దుప్పటి కప్పుకొని సీసీ కెమెరా ముందు కుప్పిగంతులు వేశాడు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫుటేజ్ ఆధారంగా దొంగల వేట ప్రారంభించారు.
ఫుల్ జోష్.. దొంగతనం చేసిన తర్వాత ఎలా డ్యాన్స్ చేశాడో చూడండి…!
By Anil Kumar
-
Previous article
Next article